|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 12:56 PM
రోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని గ్రెనడా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వ్యాయామానికి ఒక గంట ముందు 3 మిల్లీగ్రాముల కెఫిన్ (ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీకి సమానం) తీసుకుంటే కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుందని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా, మధ్యాహ్నం వ్యాయామం చేసేవారిలో మంచి ఫలితాలు కనిపించినట్లు తెలిపింది. ఈ పరిశోధనలో 32 ఏళ్లలోపు 15 మందిపై ఏడు రోజుల పాటు నాలుగుసార్లు వ్యాయామ పరీక్షలు నిర్వహించగా, ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు ప్రకటించింది.
Latest News