|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 12:26 PM
గుడివాడ టూ టౌన్ పరిధిలోని బేతవోలు ఫ్లైఓవర్‌పై సోమవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రిక్ ఓలా స్కూటీకి అగ్నిప్రమాదం జరిగింది. టీజీ 08 కే 6599 నంబరు గల స్కూటీ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. స్కూటీపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Latest News