|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 03:05 PM
గురువారం మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా అరటి రైతులు దూళ్ళ గాలెయ్య, మాదంశెట్టి కోటేశ్వరరావు, దూళ్ళ ఆంజనేయులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు పాకనాటి పృథ్వీరాజ్ గారు, సోమేపల్లి గ్రామంలోని జనసేన పార్టీ నాయకులతో ఫోన్ ద్వారా మాట్లాడి నష్టాన్ని అంచనా వేశారు. నష్టపోయిన అరటి రైతుల తరపున సోమవారం అధికారులను కలిసి, పంట నష్టంపై అంచనా వేసి రైతులకు త్వరగా నష్టపరిహారం అందించాలని కోరనున్నారు.
Latest News