|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 08:38 PM
ఒక వేస్టేజ్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవి క్షణాల్లోనే పక్కనే ఉన్న మరో దుకాణానికి వ్యాపించాయి. వేస్టేజ్ పదార్థాలు దగ్ధమవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దీంతో సమీపంలోని కార్మికులు, ప్రజలు ఊపిరాడక భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నాయి. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.
Latest News