|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 02:27 PM
గూగుల్‌లో కొన్ని రకాల సెర్చ్‌లు మిమ్మల్ని నేరుగా జైలుకు పంపగలవని హైకోర్టు న్యాయవాది హెచ్చరించారు. బాంబుల తయారీ, చైల్డ్ అశ్లీల చిత్రాలు, పైరేటెడ్ సినిమాలు, హ్యాకింగ్ పద్ధతులపై సెర్చ్ చేయడం తీవ్రమైన నేరాలని, దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలుగా పరిగణిస్తారని తెలిపారు. సైబర్ నేరాలు పెరిగాయని, వ్యక్తిగత స్వేచ్ఛ ముసుగులో చేసే ఆన్‌లైన్ చర్యలు చట్టపరమైన చిక్కులకు దారితీస్తాయని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని, మైనర్లు చేసినా చట్టపరమైన పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.
Latest News