|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 02:12 PM
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుక అనంతరం ప్రముఖుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో 75 మంది ప్రధాన చెఫ్‌లు, 45 మంది పేస్ట్రీ చెఫ్‌లు, 325 మంది సేవా సిబ్బంది కలిసి 70కి పైగా వంటకాలను సిద్ధం చేశారు. జపనీస్ శైలి పబ్ ఆహారం, అప్పుడే తయారుచేసిన ఐస్‌క్రీమ్‌తో పాటు 600 హోం మేడ్ పిజ్జాలు, బంగారు పొడితో అలంకరించిన రెండు వేల చాక్లెట్ ఆస్కార్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విందులో 1700 షాంపైన్ బాటిళ్లను కూడా సర్వ్ చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని నిరాశ్రయులకు పంపిణీ చేస్తారు.
Latest News