|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 12:20 PM
పుచ్చకాయపై ఉప్పు వేసుకుని తినడం వల్ల శరీరంలో సోడియం పెరిగి, నీరు నిల్వ ఉండటం, వాపు, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. గ్యాస్, ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలున్నవారు ఉప్పుతో పుచ్చకాయ తినడం మానేయాలి. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు, ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహారం తినడం, కోసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచడం, రాత్రిపూట ఎక్కువగా తినడం వంటివి చేయకూడదు.
Latest News