|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 01:58 PM
త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 23 మంది అభ్యర్థులను ప్రకటించడంతో, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది. మొదటి జాబితాలో 42 మందిని ప్రకటించారు. రెండో జాబితాలో పార్టీ సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిచ్చారు. అబ్దుల్ ఖాలీక్, వాజెద్ అలీ చౌదరి, అబుల్ కలాం రషీద్ ఆలం, రకీబుద్దీన్ అహ్మద్ వంటి నేతలకు మరోసారి అవకాశం దక్కింది. అసోం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి.
Latest News