|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 12:11 PM
చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు, విటమిన్లు ఎ, డి, ఇ, కె, ఫ్లోరిన్, అయోడిన్, ఇనుము, కాల్షియం, జింక్, భాస్వరం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మతిమరుపు, అల్జీమర్స్, డిప్రెషన్, కీళ్ల నొప్పులు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. వారానికి కనీసం రెండు, మూడు సార్లు చేపలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 2016లో అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో చేపలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వెల్లడైంది. చేపలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Latest News