|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 04:14 PM
AP: శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూల్ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. విశాఖ జిల్లా భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ బైక్‌పై వెళ్తుండగా స్కూల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ స్పాట్‌లో మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Latest News