భారత్‌లో ఉన్న విదేశీయులకి శుభవార్త
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 04:09 PM

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల కోసం వీసా గడువు పెంపు, జరిమానాల మినహాయింపును ప్రకటించింది.దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించిన వివరాల ప్రకారం, గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న వీసాలు, ఈ-వీసాలను ఉచితంగా ఒక నెల పాటు పొడిగించనున్నారు. ఫిబ్రవరి 28 తర్వాత యుద్ధం కారణంగా అనివార్యంగా భారత్‌లో ఉండిపోయిన విదేశీయులకు ఓవర్‌స్టే పెనాల్టీని కూడా పూర్తిగా మినహాయించారు. ప్రయాణ మార్గాలు పునరుద్ధరించిన తర్వాత వారు తిరిగి వెళ్ళడానికి అవసరమైన ఎగ్జిట్ పర్మిట్లను కూడా ఉచితంగానే జారీ చేయనున్నారు. ఒకవేళ ఎవరైనా సాంకేతిక కారణాల వల్ల వీసా పొడిగింపునకు దరఖాస్తు చేయలేకపోయినా, దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబోమని అధికారులు స్పష్టం చేశారు. 

Latest News
PLI scheme for food processing industries sees Rs 9,207 crore investment Sat, Mar 28, 2026, 11:50 AM
Rs 11,200 crore Noida International Airport gives major connectivity boost, drives economic growth Sat, Mar 28, 2026, 11:49 AM
4,032 government-run petrol pumps operational in Haryana, says CM Nayab Saini Sat, Mar 28, 2026, 11:48 AM
ED conducting raids at 8 locations in Bengal in land scam case Sat, Mar 28, 2026, 11:47 AM
Minor killed in stabbing during wedding procession clash in Delhi's Rani Bagh Sat, Mar 28, 2026, 11:46 AM