|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:35 PM
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పులో భాగంగా 25 మందికి పైగా సీనియర్ ఎమ్మెల్యేలు గురువారం రాత్రి బెంగళూరులో రహస్యంగా సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే, మరోవైపు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం గమనార్హం.దీనికి ఒకరోజు ముందు జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) సమావేశానికి 50 మందికి పైగా ఎమ్మెల్యేలు గైర్హాజరైన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా భేటీలో, గత కొన్ని నెలలుగా పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని, అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే రాబోయే రెండేళ్ల పాలనతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
Latest News