|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 02:13 PM
మహిళలు బహిష్టు సమయంలో సెలవులు ఇవ్వాలనే నిబంధనను చట్టబద్దం చేయడం మంచిది కాదేమోనని.. దీనిపై ఆలోచించాలని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ అన్నారు. ఈ నిబంధన మంచి ఆలోచనతో తీసుకున్నప్పటికీ.. ఇది మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. ప్రతీనెలా ఇలాంటి నిబంధన వలన మహిళలు తప్పనిసరిగా సెలవు తీసుకోవాల్సి వస్తుందని.. అలాంటప్పుడు యాజమాన్యం ఆలోచనలో మార్పు వస్తుందేమోనని చెప్పారు. పరిశ్రమల యాజమాన్యాల మైండ్ సెట్ అలాగే ఉంటుందని.. అలాంటి ఆలోచన చేస్తే మహిళల ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయని తెలిపారు. రాష్ట్రాలకు మహిళల బహిష్టు సమయంలో సెలవులు ఇవ్వాలని దాఖలైన పిటీషన్ పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నిబంధన అసంకల్పితంగానే మహిళల ఉద్యోగావకాశాలు దెబ్బ తీస్తాయని పేర్కొన్నారు.
Latest News