|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 01:02 PM
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక కథనం ప్రకారం... 56 ఏళ్ల మోజ్తబా పరిస్థితి విషమంగా ఉంది. దాడుల్లో ఆయన ఒకటి లేదా రెండు కాళ్లు కోల్పోయారని, కాలేయం వంటి అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనకు చికిత్స అందిస్తున్నారని, ఆయన కోమాలో ఉన్నారని సమాచారం.మోజ్తబా గాయపడిన విషయాన్ని ఇరాన్ వర్గాలు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. సైప్రస్‌లోని ఇరాన్ రాయబారి అలీరెజా సలారియన్ మాట్లాడుతూ, "ఆయన కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అందుకే ప్రస్తుతం ప్రజల ముందుకు వచ్చి ప్రసంగించే స్థితిలో లేరు" అని తెలిపారు.ఈ వార్తలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, "ఆయన బహుశా బతికే ఉండొచ్చు. కానీ ఆయన పరిస్థితి ఏమాత్రం బాగాలేదు" అని వ్యాఖ్యానించారు.
Latest News