|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:57 PM
దేశవ్యాప్తంగా పాలు అమ్మేవారికి FSSAI కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై లీటర్, అర లీటర్ పాలు అమ్మినా తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా డైరీ కోఆపరేటివ్ సొసైటీలలో భాగం కాని, ఇంటింటికీ తిరిగి పాలు అమ్మే వ్యాపారులు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని మార్చి 11న అడ్వైజరీ జారీ అయింది.ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రజారోగ్యంపై పెరుగుతున్న ఆందోళనలే. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన భారీ పాల కల్తీ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పాలల్లో యూరియా, డిటర్జెంట్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిపి విక్రయిస్తున్నట్లు ఏపీలో జరిగిన తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే పాలు వినియోగదారులకు చేరేలోపు ఎక్కడ కల్తీ జరుగుతుందో కనిపెట్టడానికి, ప్రతి వ్యాపారిని పర్యవేక్షించడానికి కేంద్రం ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను చేపట్టింది.
Latest News