|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:50 PM
AP: బాపట్ల జిల్లా, మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో గురువారం తల్లి, కూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివాహం నిశ్చయమై, ఎంగేజ్‌మెంట్ జరిగిన వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన దివ్య (25), ఆమె తల్లి సుజాత (46) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వరుడు శేషుబాబు, దివ్యను రహస్యంగా తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ దివ్య, సుజాతలు మృతి చెందారు. మార్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News