|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 11:06 AM
కోడుమూరు పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హంద్రీనది ఒడ్డున ఉన్న వల్లెలాంబాదేవి ఆలయంలో ఈనెల 18 నుంచి 20 వరకు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. 18న గోపూజ, గణపతి పూజలు, 19న రథోత్సవం, 20న పారువేటతో ఉత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, పూల వాసు, సాలప్ప, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Latest News