‘బ్లాక్ క్లాడ్’ కిల్ స్క్వాడ్ రక్షణలో మోజ్తాబా ఖమేనీ.. ఈ వ్యవస్థ ప్రత్యేకతలేమిటో తెలుసా
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 07:56 PM

ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ఆయన కుమారుడు మోజ్తభా ఖమేనీ కూడా ఇజ్రాయిల్ దాడుల్లో గాయపడినట్లు ప్రచారం జరిగింది. ఆయన ఆరోగ్యం వస్తున్న వదంతులను తాజాగా ఇరాన్‌ ఖండించింది. మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగా, క్షేమంగానే ఉన్నారని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కుమారుడు యూసఫ్‌ తెలిపారు. మోజ్తాబా ఖమేనీ గాయపడినట్లు జరుగుతోన్న ప్రచారం తన దృష్టికి వచ్చందని ఆయన అన్నారు. ఆయనతో టచ్‌లో ఉన్న తన మిత్రులతో ఆరా తీయగా.. ఆయన క్షేమంగా, ఆరోగ్యంగానే ఉన్నారని వారు చెప్పినట్టు పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజు మొజ్తాబా తన తండ్రి ఖమేనీ, భార్య, పిల్లలు సహా పలువురు కుటుంబసభ్యులను కోల్పోయారు.


ఈ దాడుల్లో ఆయన కూడా గాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయలేదు. యుద్ధం తీవ్రమవుతున్నా.. ఆయన బయటకు రాలేదు. ప్రజలను ఉద్దేశించి ప్రసగించలేదు. సుప్రీం నేతగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో ఆయన భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా, పెజిష్కియాన్ ప్రకటనతో ప్రచారానికి చెక్‌ పెట్టినట్లయ్యింది.


ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఎన్ఓపీఓ అనే ప్రత్యేక దళం రక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. 56 ఏళ్ల ఖమేనీ ఉగ్రవాద నిరోధక ప్రత్యేక దళంఎన్ఓపీఓ భద్రత మధ్య రహస్య ప్రదేశంలో ఉన్నట్టు పారిస్‌కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ విదేశీ వ్యవహారాల కమిటీ అధికారి అల్వీ సఫావీను ఉటంకిస్తూ అమెరికా మీడియా ఫాక్స్ న్యూస్ నివేదించింది.


ఏంటీ ఎన్ఓపీఓ దళం?


ఇరాన్ ఎలైట్ పోలీస్ విభాగమైన ఎన్ఓపీఓ దళాన్ని 1991లో ఏర్పాటుచేశారు. ఇరాన్ పోలీస్ వ్యవస్థలో ఇది ఉత్తమ ప్రత్యేక విభాగంగా, అత్యంత శిక్షణ పొందిందిగా దీనికి గుర్తింపు ఉంది. బందీలను రక్షించే పనిలో నామమాత్రంగా ఉన్నప్పటికీ, NOPO 1999 విద్యార్థుల నిరసనలు, 2019 అశాంతి,, మహ్సా అమిని నిరసనలతో సహా అనేక ఆందోళనలు హింసాత్మకంగా అణచివేయడంలో పాల్గొంది. ఈ దళం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.


‘ఎన్ఓపీఓ అనేది నిరౌయే విజే పస్దరన్ వేలాయత్ ఫార్సీ సంక్షిప్త రూపం.. దీని అర్థం సుప్రీం నాయకుడిని రక్షించడానికి ప్రత్యేక దళం’ అని సఫావి పేర్కొన్నారు. ‘వేలాయత్ తప్పనిసరిగా సుప్రీం నాయకుడు రక్షణ మాత్రమే కాదు పాలన మొత్తం’ అని అన్నారు. ఇది సరిహద్దుల్లో ఉండే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు భిన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగు టెహ్రాన్‌లో.. మషహద్, ఇస్ఫాహన్‌లో ఒక్కొక్కటి సహా ఇందులో కేవలం ఆరు బ్రిగేడ్లు ఉంటాయని చెప్పారు. ఐఆర్జీసీ కంటే క్రూరమైన, శిక్షణలో రాటుదేలినవారని అభిప్రాయపడ్డారు. ఈ దళాలను ఖమేనీ రక్షణకు వినియోగిస్తున్నారని సఫావీ తెలిపారు.


‘వారు పూర్తిస్థాయిలో ఆయుధాలు కలిగి ఉంటారు. ఖమేనీ తన రక్షణ కోసం మరే ఇతర భద్రతా దళాన్ని విశ్వసించలేదు.. ఆయతుల్లా అలీ ఖమేనీ హత్య సమయంలో కొందరు ప్రాణాలు కోల్పోయి ఉంటారు కానీ, ఈ దళం పూర్తిస్థాయిలో పనిచేస్తుంది’ అని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలను అణచివేయడానికి జనంపై కాల్పులు జరిపింది కూడా ఈ దళాలే అని అన్నారు. ఇరాన్‌లోని రాజకీయ ఖైదీలను ఉంచిన జైళ్ల చుట్టూ వందలాది మంది ఎన్ఓపీఓ సభ్యులను విస్తృతంగా మోహరించారనే నివేదికల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM