|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:36 PM
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జీజీహెచ్ ప్రాంగణం నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, నెఫ్రాలజీ సిబ్బంది, 200 మందికి పైగా నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన చికిత్సలు, డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాలని సూచించారు.
Latest News