|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 02:36 PM
AP: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 6.5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల ఏర్పాటుకు వీలుగా, ప్రతి జిల్లాకు 300 నుంచి 1000 ఎకరాల భూమిని సేకరించి APIICకి అందించాలని సూచించింది. గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల కలెక్టర్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విద్యుత్, నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు భూములు కేటాయించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
Latest News