|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 02:52 PM
క్రికెటర్ అమిత్ మిశ్రా అదనపు కట్నం కోసం తనను వేధించాడని అతని భార్య గరిమా ఆరోపణలు చేసింది. ఈ మేరకు యూపీలోని కాన్పూర్ కోర్టును ఆమె ఆశ్రయించారు. అమిత్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. మద్యం సేవించి అమిత్ తనను తిట్టి, కొట్టేవాడని తెలిపారు. కనీసం తినడానికి ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ పిటిషన్‌పై కోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.ఈ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా తివారి గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గృహహింస, వేధింపులు, దౌర్జన్యం అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొంది. మోడల్ అయిన గరిమాకు 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గరిమా ఆరోపణల ప్రకారం.. పెళ్లి తర్వాత అమిత్ మిశ్రా, అత్తమామలునిరంతరం వేధింపులకు గురి చేశారు. రూ.10 లక్షలు, హోండా సిటీ కారు రూపంలో కట్నం కోరారని, ఆమె కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చినా, మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని తెలిపారు.
Latest News