|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:46 PM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. ఒక నెయ్యి ట్యాంకర్ ప్రమాదానికి గురైనప్పటికీ, మిగిలిన రెండు సంస్థల నుంచి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని, ప్రస్తుతం 7 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
Latest News