|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 11:14 AM
AP: పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీరభద్రపురం, గొండోలు, కొనలోవ, గవరయ్యపేట, కొట్టంపాలెం పరిసర గ్రామాల్లో పెద్దపులి జాడలను గుర్తించారు. హైవే దాటుకొని అవతలి వైపు ఉన్న అడవిలోకి ప్రవేశిస్తే అటు రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉంది. పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు.
Latest News