ఖమేనీ హత్యపై భారత్‌లో నిరసనలు.. అమెరికా సైన్యంలో పనిచేసే భారతీయ మహిళ తీవ్ర విమర్శలు
 

by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:42 PM

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ భారత్‌లో జరుగుతున్న నిరసనలపై అమెరికా సైన్యంలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన శిల్పా చౌదరి అనే మహిళ తీవ్రంగా స్పందించారు. ఈ ఆందోళనలతో మన దేశాన్ని ఇతరులు చూస్తున్న విధానం తనను ఓంతో బాధిస్తోందని ఆమె అన్నారు. అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన శిల్పా చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో ఈ ఏడాది హోలీ జరుపుకోవాలని తనకు అనిపించడం లేదు.. తాను ముస్లిం వ్యతిరేకిని కాదు.. తనకు బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం అని.. తాను తీవ్రవాదానికి వ్యతిరేకమని’ ఆమె అన్నారు.


‘‘భారత ప్రజలను ఎవరూ ఎగతాళి చేయరాదనేది నా ఆవేదన.. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అక్కడ (భారత్) ఉన్న మీరు దానిని గ్రహించకపోవచ్చు.. కానీ నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూడగలను.. భారత్‌లో వివిధ ప్రదేశాలలో నిరసనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మతపరంగా మీరు చాలా బాధపడుతున్నారని నాకు అర్థమైంది. దాని గురించి నేను మాట్లాడను. నాదే ఒకే ప్రశ్న.. అక్కడ జరుగుతున్న నిరసనలు ఆందోళనకు గురిచేస్తుంటే వాటి వల్ల మీరు ఏ విధంగా ప్రయోజనం పొందుతారో తెలుసుకోవాలనుకుంటున్నాను? మీ ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటున్నంది ఏంటి?’ ఆమె ప్రశ్నించారు.జమ్మూ కశ్మీర్‌లో వేలాది మంది షియా ముస్లింలు రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారు.


‘ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు, నిజంగా ఆయన మంచోడే అయితే అలా జరిగేది కాదు.. ఇప్పటికైనా మీరు కళ్లు తెరవండి... విశాలంగా ఆలోచించండి.. భారత్‌ను ప్రపంచ మొత్తం గౌరవిస్తుంది.. మనం మన దేశాన్ని ప్రేమించాలి.. మరో దేశాన్ని ప్రేమిస్తే మీరు అక్కడ వెళ్లి నిరసనలు చేయండని చెప్పే పరిస్థితిని తెచ్చుకోవద్దు’ అని శిల్పా చౌదరి సూచించారు.


ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా జరిపిన సంయుక్త దాడిలో ఖమేనీ మరణించారు. ఆయన ఇరాన్ సుప్రీం లీడర్‌గా 1989లో తన తండ్రి ఆయతుల్లా రౌహల్లా ఖోమేనీ మరణం తర్వాత బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ఇజ్రాయెల్, అమెరికాలకు టార్గెట్‌ అయ్యారు. ఈ నాలుగు దశాబ్దాల్లో ఆయనపై అనేక హత్య ప్రయత్నాలు జరిగినా తప్పించుకున్నారు. చివరకు శనివారం నాటి దాడిలో తన కార్యాలయంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Latest News
Pakistan's internal policy failures fuelling Balochistan insurgency Fri, May 08, 2026, 03:34 PM
Italy parliamentary committee to probe Chinese tech investments Fri, May 08, 2026, 03:14 PM
'Prince Yadav will make his India debut soon': Rayudu Fri, May 08, 2026, 03:12 PM
Don't believe DMK-AIADMK will form govt in TN, crisis likely to end soon, says Kumaraswamy Fri, May 08, 2026, 03:09 PM
Wolvaardt leads ICC Women's Player of the Month shortlist Fri, May 08, 2026, 03:05 PM