|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:39 PM
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తాజాగా ఇచ్చిన ఒక వీడియో వాంగ్మూలం అగ్రరాజ్య రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆదేశ అతిపెద్ద కుంభకోణం అయిన సెక్స్ కుంభకోణం ప్రదాన నిందతుడు, శిక్ష అనుభవించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవని క్లింటన్ వెల్లడించారు. నేరుగా ట్రంపే తనతో ఈ విషయాలను పంచుకున్నారని కూడా క్లింటర్ స్పష్టం చేశారు. హౌస్ ఓవర్ సైట్ కమిటీ ముందు ప్రమాణ స్వీకారం చేసి మరీ క్లింటన్ ఈ విషయాలను బయటపెట్టడం గమనార్హం.
గోల్ఫ్ కోర్టులో బయటపడ్డ రహస్యాలు
2002 లేదా 2003 ప్రాంతంలో జరిగిన ఒక గోల్ఫ్ టోర్నమెంట్‌లో ట్రంప్ తనతో ఎప్‌స్టీన్ గురించి మాట్లాడినట్లు క్లింటన్ తెలిపారు. "ఎప్‌స్టీన్‌తో కలిసి గడిపిన కాలం చాలా అద్భుతంగా ఉండేదని, మేమిద్దరం ఎన్నో ఏళ్లు కలిసి ఎంజాయ్ చేశామని ట్రంప్ నాతో చెప్పారు. అయితే ఒక రియల్ ఎస్టేట్ డీల్ విషయంలో మా ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోయామని ఆయన వివరించారు" అని క్లింటన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఎప్‌స్టీన్ విమానంలో తాను ప్రయాణించిన విషయం కూడా ట్రంప్‌కు అప్పటికే తెలుసని ఆయన గుర్తు చేసుకున్నారు.
మసాజ్‌లు, విమాన ప్రయాణాలపై క్లింటన్ వివరణ
తాను ఎప్‌స్టీన్ విమానాల్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్ పర్యటనలు చేసిన మాట నిజమేనని క్లింటన్ అంగీకరించారు. తన ఛారిటబుల్ ఫౌండేషన్ పనుల కోసం ఎప్‌స్టీన్‌తో ఆర్థిక సాయం చేసే దాతగా పరిచయం అయ్యారని ఆయన తెలిపారు. అయితే ఎప్‌స్టీన్ విమానంలో తనకు ఒక మహిళ మసాజ్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. "ధనవంతుల విమానాల్లో ఇలాంటివి సహజం. అప్పట్లో ఆమె ఎప్‌స్టీన్ బాధితురాలని నాకు తెలియదు" అని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఎప్పుడూ ఎప్‌స్టీన్ ప్రైవేట్ ద్వీపానికి వెళ్లలేదని, తన అధ్యక్ష కాలంలో ఎప్‌స్టీన్ 17 సార్లు వైట్‌హౌస్‌కు వచ్చినట్లు తనకు తెలియదని క్లింటన్ స్పష్టం చేశారు.
నేరం చూడలేదు.. ఆధారాల్లేవు!
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. క్లింటన్, ట్రంప్ ఇద్దరూ కూడా ఎప్‌స్టీన్ వద్ద ఎలాంటి లైంగిక అక్రమ రవాణా జరగడం తాము చూడలేదని కమిటీకి తెలిపారు. 2008లో ఎప్‌స్టీన్ మైనర్లతో వ్యభిచారం కేసులో దోషిగా తేలడానికి ముందే తాము అతనికి దూరం అమయ్యామని ఇద్దరూ వాదించారు. ట్రంప్ తన మార్-ఎ-లాగో క్లబ్‌లో పనిచేసే యువతులను ఎప్‌స్టీన్ నియమించుకోవడానికి ప్రయత్నించడం వల్లే తమ బంధం దెబ్బతిందని గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని కమిటీ హిల్లరీ క్లింటన్‌ను కూడా ప్రశ్నించగా.. తనకు ఎప్‌స్టీన్ ఎవరో గుర్తు లేదని ఆమె సాక్ష్యమిచ్చారు.
Latest News