|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:45 PM
ఇరాన్‌పై సైనిక చర్యల దిశగా ఆలోచన చేస్తున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మరోసారి ప్రపంచానికి స్పష్టం చేశారు. ఇరాన్‌ను అణ్వాయుధాలు కలిగి ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తాను దశాబ్దాలుగా చెబుతున్న మాటనూ గుర్తుచేశారు. ఈ విషయంలో ట్రంప్ మొదటి నుంచీ ఒకే వైఖరితో స్థిరంగా ఉన్నారని వైట్‌హౌస్ సోమవారం ప్రకటించింది. ఇందుకు నిదర్శనంగా గత 15 ఏళ్లలో ఆయన చేసిన 74 కీలక ప్రకటనల జాబితాను విడుదల చేసింది.ట్రంప్ వ్యాఖ్యల్లో భాష మారినా, ఉద్దేశం మాత్రం ఎప్పుడూ మారలేదని ఈ జాబితా స్పష్టం చేస్తోంది. "ఉగ్రవాదానికి ప్రపంచంలోనే నంబర్ వన్ స్పాన్సర్‌గా ఉన్న ఇరాన్‌ను అణ్వాయుధాలు కలిగి ఉండటానికి నేను ఎప్పటికీ అనుమతించను" అని ట్రంప్ ఫిబ్రవరి 24, 2026న అన్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది. అంతకుముందు కూడా "వారికి అణ్వాయుధాలు ఉండకూడదు. మధ్యప్రాచ్యంలో శాంతికి అదే అడ్డంకి" వంటి వ్యాఖ్యలు చేశారు.
Latest News