హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించిన ఇరాన్
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:40 PM

అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయలాంటి హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ఏ నౌకనైనా తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్-ఇన్-చీఫ్‌కు సీనియర్ సలహాదారు అయిన బ్రిగేడియర్ జనరల్ సర్దార్ ఇబ్రహీం జబారీ ఈ ప్రకటన చేశారు. "హోర్ముజ్ జలసంధి మూసివేయబడింది. ఎవరైనా దాటడానికి ప్రయత్నిస్తే, మా సైనికులు ఆ నౌకలను తగలబెడతారు" అని ఆయన ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు ఖండించాయి. జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నాయి.

Latest News
Ipl 2026: How Akeal & Noor deconstructed DC’s batting order Wed, May 06, 2026, 10:55 AM
Two women orchestra performers among 4 killed in road accident in Bihar's Chhapra Wed, May 06, 2026, 10:45 AM
TN plus-two results likely to be delayed amid govt transition Wed, May 06, 2026, 10:40 AM
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM