|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:38 PM
హోలీ పండుగను రంగులతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఈ వేడుకలో వాడే రసాయన రంగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పండుగ సందర్భంగా ఉపయోగించే రంగులలో పారిశ్రామిక రంగులు, లెడ్ ఆక్సైడ్, రాగి వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు కళ్లపై ప్రభావం చూపి శాశ్వత నష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. రసాయనాలు కలిసిన రంగులు కళ్లకు తగిలినప్పుడు కెమికల్ రీ యాక్షన్ జరిగి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.
Latest News