|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 11:57 AM
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణం తరువాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆచూకీపై నెలకొన్న సస్పెన్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించగా, అలాంటి దాడి జరగలేదని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. దీంతో 'Where is Benjamin Netanyahu?' అనే ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నెతన్యాహు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Latest News