|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:38 PM
2029లో వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని కొడాలి నాని, ఇతర వైయస్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ‘కూటమి బెదిరింపులకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారు.అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైయస్ఆర్‌సీపీ భయపడదు. 2029లో వైయస్ఆర్‌సీపీ అధినేత, వైయస్ జగన్ సీఎం కావడం తథ్యం’అని స్పష్టం చేశారు.
Latest News