|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:07 PM
బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన డ్రగ్స్ అలవాటు గురించి ఇంట్లో ఫిర్యాదు చేసిందన్న కోపంతో 13 ఏళ్ల బాలుడు 9 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మత్తుకు బానిసైన ఓ బాలుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడైన 13 ఏళ్ల బాలుడు కొంతకాలంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని గమనించి బాలుడి సంరక్షకులకు తెలియజేసింది. దీంతో వారు అతడిని మందలించగా, ఆ చిన్నారిపై పగ పెంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం బాలిక ఒంటరిగా కనిపించడంతో ఇదే అదనుగా భావించి పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న తమ కుమార్తెను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.
Latest News