|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:02 PM
తమిళ రాజకీయాల్లో వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా సందడి చేశారు. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ పుట్టినరోజు (మార్చి 1) వేడుకల్లో పాల్గొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా తన గళాన్ని వినిపించారు.ఈ సందర్భంగా స్టాలిన్ అందిస్తున్న అద్భుతమైన సంక్షేమ పథకాలను రోజా ఆకాశానికెత్తారు. ముఖ్యంగా తమిళనాడులో మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రతినెలా వారి ఖాతాల్లో నేరుగా వెయ్యి రూపాయలు జమ చేయడం వంటి పథకాలు మహిళా సాధికారతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో మహిళలకు నేరుగా నగదు అందిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
Latest News