|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:36 AM
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పతనమవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.50కి 3-4కిలోలు ఇస్తున్నా తమకు కూలి, రవాణా ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లాలో 30 కిలోల టమాటా బాక్స్ కేవలం రూ.90 పలికినట్లు చెప్పారు. సాగు ఆలస్యం కావడం, 15 రోజులుగా పంట కోతకు వస్తుండటంతో ధరలు భారీగా తగ్గాయని అంటున్నారు.అయితే టమాటా లేని వంటకాలను ఊహించుకోలేము. ఇక టమాటల ధరలు కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. ఒక్కోసారి ఉన్న ఫలంగా ధరలు భారీగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో తగ్గుతుంటాయి. అందుకే టమాటా పచ్చడికి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. టమాటా పచ్చళ్లు సూపర్ మార్కెట్లతోపాటు చిన్న చిన్న కిరాణం దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఈ టమాటా పచ్చళ్లతో వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలను పొందవచ్చు. హోటల్స్, రెస్టారెంట్స్ తోపాటు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు.
Latest News