టెహ్రాన్ గాంధీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి: WHO ఆందోళన
 

by Suryaa Desk | Mon, Mar 02, 2026, 10:22 AM

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రి ధ్వంసమైంది. దీంతో వైద్యులు, సిబ్బంది, రోగులను ఖాళీ చేయించారు. ఈ దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ స్పందిస్తూ, ఆస్పత్రులపై దాడులు ఆందోళనకరమని, వాటిని నిరోధించాలని సూచించారు. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి గాంధీ ఆస్పత్రితో పాటు మరో మూడు ఆస్పత్రులపై దాడులు జరిగినట్లు తెలిపారు. గతంలోనూ ఈ ఆస్పత్రిపై దాడులు జరిగాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం అణు, సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.

Latest News
India's logistics cost to drop to 9 pc over robust road infra: Nitin Gadkari Thu, Apr 30, 2026, 01:37 PM
SP protests in UP Assembly over women's quota bill, accuses BJP of misleading public Thu, Apr 30, 2026, 01:14 PM
Owaisi criticises Haj airfare hike, seeks withdrawal of circular and refund for pilgrims Thu, Apr 30, 2026, 12:58 PM
Bihar road rage case: Main accused injured in police encounter, arrested Thu, Apr 30, 2026, 12:50 PM
Gujarat ranks 3rd nationwide with 46.71 pc mobile phone recovery rate, surpassing national average Thu, Apr 30, 2026, 12:49 PM