ప్రాసెసింగ్ ఫీజూ తక్కువే.. 8.75 శాతం వడ్డీకే లోన్
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 11:49 PM

వివిధ ఆర్థిక అవసరాలకు చాలా మంది బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు సైతం మెరుగైన క్రెడిట్ స్కోరు (750 పైన) ఉన్న వారికి తక్కువ వడ్డీ రేట్లకే ఈ రుణాలను ఇస్తున్నాయి. ఆన్‌లైన్లో కూడా వీటి కోసం అప్లై చేయవచ్చు. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో పరిమిత కాలానికి స్పెషల్ వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. అంటువంటి ఆఫర్ సమయాల్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందవచ్చు. పేరున్న ప్రముఖ కంపెనీల్లో పని చేసే వారికి పర్సనల్ లోన్లపై వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తుంటాయి. అందుకే లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్ ఫీజులను సరిపోల్చి చూసుకోవాలి.


వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు తెలుసుకుంటే తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లోకెళ్ల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ అత్యల్ప వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచే మొదలవుతున్నాయి. అలాగే ఇందులో ప్రాసెసింగ్ ఫీజు సైతం 1 శాతం వరకే ఉంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారు కనిష్ఠ వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు.


యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 9.50 శాతం నుంచి మొదలవుతున్నాయి. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంటుంది.


పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో వడ్డీ రేటు 9.60 శాతం నుంచి ప్రారంభమవుతుండాగ ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు ఉంది.


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 9.65 శాతం నుంచి మొదలవగా 1 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంది.


కెనరా బ్యాంకులో వడ్డీ రేటు 9.70 శాతం నుంచి మొదలవగా ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతంగా ఉంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వడ్డీ రేటు 9.95 శాతం నుంచి వడ్డీ మొదలవుతుండగా ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంటుంది.


యూకో బ్యాంకులో వడ్డీ రేటు 9.95 శాతం నుంచి ప్రారంభమవుతుండగా ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు ఉంది.


కోటక్ మహీంద్రా బ్యాంకులో వడ్డీ రేటు 9.98 శాతం నుంచి మొదలవుతుండగా ప్రాసెసింగ్ ఫీజు 5 శాతం వరకు ఉంది.


ఐసీఐసీఐ బ్యాంకులో వ్యక్తిగత రుణ వడ్డీ రేటు 9.99 శాతం నుంచి మొదలవుతుండగా ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంటుంది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM