కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం,,,,దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:18 PM

గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను నివారించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హ్యుమన్‌పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. జాతీయ వ్యాక్సినేషన్‌‌ కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్లు దాటిన బాలికలకు హెచ్‌పీవీ టీకాను ఉచితంగా అందజేయనున్నట్ుట కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఆరోగ్య కేంద్రాల్లో గార్డాసిల్‌ ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


ఈ టీకా నాలుగు రకాల గర్భాశయ కేన్సర్లను నిరోధిస్తుంది. ఈ కేన్సర్‌కు కారణమయ్యే HVP టైప్‌ 16, 18 తోపాటు 6, 11 రకాల నుంచి టీకా రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.


ఒక డోసుతో బాలికలకు దీర్ఘకాల రక్షణ కల్పిస్తుందని పలు శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడయ్యింది. జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను స్వచ్ఛందంగా, ఉచితంగా అందివనున్నన్నారు. ప్రపంచంలో అత్యధికంగా గర్బాశయ ముఖద్వార కేన్సర్ బాధితులు చైనా, అమెరికా తర్వాత భారత్‌‌లోనే ఉన్నారు. 2040 నాటికి దేశంలో కేన్సర్ బాధితుల సంఖ్య ఏడాదికి 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏడాదికి 2 కోట్ల మంది కేన్సర్ బారిన పడుతుండగా.. ఇందులో భారతీయులనే 15 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


అయితే, దేశంలో తొలిసారి 14 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాను అందజేసిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. మహిళలకు ఎక్కువగా వచ్చే కేన్సర్లలో గర్బాశయ ముఖద్వార కేన్సర్ ప్రధానమైంది. అవగాహన, వ్యాక్సినేషన్ ద్వారా దీనిని నిరోధించవచ్చు. 2030 నాటికి గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే.. ఏటా వేలాది ప్రాణాలను రక్షించవచ్చు. ఈ టీకా తీసుకున్న మహిళలు.. జీవితకాలంలో రెండు లేదా మూడుసార్లు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. ఓ పరిశోధన ప్రకారం.. 30 ఏళ్లలోపు మహిళలు హెచ్‌పీవీ టీకాను తీసుకుంటే భవిష్యత్తులో కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ఇక, 12 నుంచి 24 ఏళ్లలోపు వారు వ్యాక్సిన్ వేసుకుంటే జీవితకాలంలో కేవలం 2-3సార్లు మాత్రమే స్క్రీనింగ్ పరీక్షలు అవసరమవుతాయి.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM