|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 02:53 PM
శ్రీ సత్యసాయి జిల్లాలో వడ్డెర కుల బాంధవుల సమస్యలను తెలుసుకొని, పరిష్కరించే లక్ష్యంతో 'గ్రీవెన్స్' కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె మల్లేశ్వర రావు పాల్గొని, ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వృత్తిపరమైన సమస్యలు, ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాల అమలుపై వినతి పత్రాలు సమర్పించారు. నాయకులు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వడ్డెరలందరూ ఐక్యంగా ఉండి సాధికారత సాధించాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Latest News