|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 12:40 PM
హర్యానాలోని ఫరీదాబాద్‌లో శనివారం సాయంత్రం సూరజ్‌కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళాలో 'సునామీ రైడ్' అకస్మాత్తుగా విరిగిపడటంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్ మృతి చెందగా, మరో 13 మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు.శనివారం సాయంత్రం సుమారు 6.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సునామీ రైడ్‌లో సుమారు 15 మంది పర్యాటకులు ఉన్నారు. రైడ్ వేగంగా తిరుగుతుండగా.. కింద ఉన్న సందర్శకులు ఉత్సాహంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈక్రమంలోనే ఊహించని విధంగా రైడ్ ఒక పక్కకు ఒరిగిపోయి.. వెంటనే దాని ఫ్రేమ్ విరిగి ఒక్కసారిగా నేలకూలింది. ఈ దృశ్యాన్ని చూసిన పర్యాటకులు భయాందోళనతో పరుగులు తీశారు. గాలిలో వేలాడుతున్న వ్యక్తులు హాహాకారాలు చేస్తూ కింద పడిపోవడం అక్కడున్న వారిని నివ్వెరపరిచింది.హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సైని ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. జనవరి 31న ప్రారంభమైన ఈ మేళా ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది.
Latest News