|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 12:17 PM
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్, ఐఫోన్ 17ఈని ఫిబ్రవరి 19న విడుదల చేయనుంది. మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకుని, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ మార్కెట్లోకి వస్తోంది. ఇందులో పాత నాచ్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్, కొత్త A19 చిప్, 48MP కెమెరా, 256GB స్టోరేజ్, 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. భారత కరెన్సీలో సుమారు రూ.60,000 వరకు ధర ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
A19 చిప్‌తో మరింత వేగం:
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 17ఈలో కొత్తగా A19 చిప్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న A18 చిప్‌తో పోలిస్తే 5–10 శాతం వరకు వేగంగా పనిచేస్తుందని తెలుస్తోంది. డైలీ యూజ్‌తో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌లోనూ మెరుగైన అనుభవం అందించే అవకాశం ఉంది.
డిస్‌ప్లే విషయంలో కూడా ఎలాంటి రాజీ లేకుండా 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను యాపిల్ ఇవ్వనున్నట్లు సమాచారం. బ్రైట్‌నెస్, కలర్ అవుట్‌పుట్ పరంగా ఇది ప్రీమియం ఐఫోన్లకు దగ్గరగా ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Latest News