|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 12:11 PM
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, యూఎస్‌ఏల మధ్య జరగనున్న మ్యాచ్‌కు స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా దూరమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం జరిగిన ట్రైనింగ్ సెషన్‌కు కూడా బుమ్రా హాజరుకాలేదు. ప్రస్తుతం 13 మంది ఫిట్ ఆటగాళ్లతోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. మరోవైపు, వాషింగ్టన్ సుందర్ ఇంకా జట్టుతో చేరలేదు, బెంగళూరులో ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.గాయంతో బాధపడుతున్న హర్షిత్ రాణా (Harshit Rana) మెగాటోర్నీ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ (BCCI) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా మోకాలి గాయానికి గురైన విషయం తెలిసిందే. ‘టీమ్‌ఇండియా పేసర్ హర్షిత్ రాణా టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మోకాలి గాయానికి గురవడమే దీనికి కారణం. స్కానింగ్ రిపోర్టులు, వైద్యుల నివేదిక ప్రకారం టోర్నమెంట్లో పాల్గొనేందుకు అతడికి ఫిట్‌నెస్ లేదని బీసీసీఐ మెడికల్ టీమ్ తేల్చింది. రాణా త్వరగా కోలుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Latest News