అమెరికా 'మోస్ట్ డేంజరస్' క్రిమినల్స్ లిస్టులో 89 మంది భారతీయులు
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:03 PM

అగ్రరాజ్యం అమెరికా తాజాగా ఆదేశ నేరస్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన "వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్" (అత్యంత ప్రమాదకరమైన) నేరగాళ్ల జాబితాను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ జాబితాలో ఇతర దేశీయులతో పాటు 89 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఉండడం గమనార్హం కాగా.. ప్రస్తుతం ట్రంప్ సర్కారు వీరిని సామూహికరంగా బహిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.


అమెరికా ప్రభుత్వం కొత్తగా WOW.DHS.GOV అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వరెస్ట్ ఆఫ్ ద వరెస్ట్ (WOW) పేరుతో రూపొందించిన ఈ డేటాబేస్‌లో సుమారు 25,000 మంది నేరచరిత్ర కలిగిన అక్రమ వలసదారుల వివరాలను పొందుపరిచారు. ఇందులో నేరగాళ్ల పేర్లు, ఫోటోలు, వారు చేసిన నేరాలు, వారి జాతీయతను కూడా బహిరంగంగా ఉంచారు. "అమెరికన్ల ప్రాణాలతో ఆడుకుంటున్న రాక్షసులను వీధుల నుంచి ఎలా తొలగిస్తున్నామో ప్రజలు స్వయంగా చూడాలనే" ఉద్దేశంతోనే ఈ వెబ్‌సైట్‌ను తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.


భారతీయులపై ఉన్న ఆరోపణలు ఇవే..


ఈ జాబితాలో ఉన్న 89 మంది భారతీయులపై హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ ట్రాఫికింగ్, దొంగతనాలు, హిట్ అండ్ రన్ కేసులు, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికాలో తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి కారణమై ముగ్గురు మృతికి కారకుడైన హర్నీత్ సింగ్, ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్‌‌ప్రీత్ సింగ్ వంటి వారి పేర్లు కూడా ఈ జాబితాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.


ట్రంప్ ప్రభుత్వం ఈ బహిష్కరణలను 'నేషనల్ ఎమర్జెన్సీ'గా ప్రకటించి సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫెడరల్ అధికారులు మాస్కులు ధరించి, బాడీ కెమెరాలు లేకుండా దాడులు చేయడంపై డెమొక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కేటాయింపు విషయంలో సెనేట్‌లో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ.. ట్రంప్ యంత్రాంగం ఇలాంటి విషయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు అమెరికాలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు.


Latest News
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
Mon, Feb 23, 2026, 03:33 PM
Mobile ban in Karnataka schools under discussion, parents also exerting pressure: Deputy CM Shivakumar Mon, Feb 23, 2026, 03:32 PM
Congress targets MP BJP govt over Ladli Behna Yojana Mon, Feb 23, 2026, 03:31 PM