|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:53 AM
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అనుమతి లేకుండా లక్కీ డ్రా పేరుతో BMW కారు బహుమతిగా ఇస్తామని ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు గోలి అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేయడం ద్వారా తిరుమల పవిత్రతను అపహాస్యం చేసినట్లు టిటిడి విజిలెన్స్ విభాగం గుర్తించి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐలు శ్రీ డి. రమేష్ బాబు, శ్రీ సి. చలపతి ఇతర సిబ్బందితో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన గోలి అనిల్‌ను 05-02-2026 న అరెస్ట్ చేయడంతో పాటు, అతని వద్ద నుంచి BMW కారు (రిజిస్ట్రేషన్ నెంబర్ AP07CM7007) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Latest News