ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోంది: ప్రధాని మోదీ
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:34 AM

ప్రపంచం ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ వైపు అడుగులు వేస్తోందని, అందులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం అన్నారు. ఎన్డీయే హయాంలోనే ‘గ్లోబల్ సౌత్’ బలమైన గొంతుకగా దేశం అవతరించిందని, గతంలో భారత్‌తో ఒప్పందాలు చేసుకోవడానికి ఏ దేశమూ పెద్దగా ఆసక్తి చూపలేదని, ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటంతో అనేక దేశాలు వాణిజ్య ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో జరిగిన ఒప్పందం ఓ మైలురాయి అని, భారత్-అమెరికా మధ్య జరిగిన ట్రేడ్‌ డీల్‌ను ప్రపంచమంతా అభినందిస్తున్నదని తెలిపారు.భారత్–-అమెరికా మధ్య జరిగిన ట్రేడ్‌‌ డీల్‌‌ను ప్రపంచమంతా అభినందిస్తున్నదని, ఇది దేశ యువతకు ఉపాధి పరంగా ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.  భారత్‌‌కు మరింత బలం పెరుగుతుందన్నారు. గత పాలకుల హయాంలో దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి దేశాలు ఎందుకు ముందుకు రాలేదో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని ప్రధాని డిమాండ్ చేశారు.  యూపీఏ హయాంలో  ప్రపంచంలోనే భారత్‌‌11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే.. ఎన్డీయే హయాంలో మూడో స్థానానికి చేరుకోబోతున్నదని చెప్పారు.  ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదన్నారు.  

Latest News
PM Modi, French President Macron begin talks in Mumbai Tue, Feb 17, 2026, 04:43 PM
Reels, speed and a deadly crash: Mother seeks accountability after minor kills her son in Delhi Tue, Feb 17, 2026, 04:42 PM
Pakistan: Police arrests 35 Afghan migrants during raids in Peshawar Tue, Feb 17, 2026, 04:07 PM
Karpoori Thakur's death anniv: Patna municipal corporation removes banners ahead of RJD event Tue, Feb 17, 2026, 04:03 PM
French President Macron pays tribute to victims of 2008 Mumbai terror attacksFrench President Macron pays tribute to victims of 2008 Mumbai terror attacks Tue, Feb 17, 2026, 03:51 PM