|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:15 PM
దేశంలోని రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశంలో 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల గురించి కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదని, అయితే తమ ప్రభుత్వం చిన్న రైతుల కోసం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని తీసుకొచ్చిందని, రైతులకు రూ. 4 లక్షల కోట్లు అందించామని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు.ఎక్స్‌ప్రెస్ వేగంతో సంస్కరణలు అమలవుతున్నాయని, 9 దేశాలతో భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. గ్లోబల్ సౌత్‌లో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలోని రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని, దేశంలో ఉన్న 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల గురించి కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలకు అస్సలు విజన్ లేదని ప్రధాని మోదీ రాజ్యసభ సాక్షిగా విమర్శించారు.చిన్న రైతుల కోసం పీఎం కిసన్ సమ్మాన్ నిధి యోజన తీసుకొచ్చామని, రైతులకు రూ.4 లక్షల కోట్లు అందించామని తెలిపారు. యూపీఏ పాలనలో బ్యాకింగ్ వ్యవస్థ నాశనమైందని.. యూపీఏ పాలనలో NPAలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తాము వచ్చాక ధైర్యంగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చేపట్టామని -ప్రధాని మోడీ చెప్పారు.
Latest News