|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:08 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, డ్వాక్రా మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వారిక అవసరమైన రుణాలు కూడా అందిస్తోంది.. సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. తాజాగా మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆర్థికంగా ఎదిగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్‌మార్ట్‌లు ఏర్పాటు చేసుకునేలా సాయం అందిస్తోంది. మెప్లా సాయంతో ఎగ్‌మార్ట్‌లతో మహిళలకు చేయూత అందిస్తున్నారు. మహిళలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మెప్మా ద్వారా అవసరమైనవి సమకూర్చుతారు. అటు గుడ్ల వినియోగం పెంచడంతో పాటుగా ఇటు మహిళలు కూడా ప్రయోజనం పొందేలా ప్లాన్ చేశారు.
మెప్మా నెక్‌తో ఒప్పందం చేసుకుని.. గుడ్లతో పాటుగా బండి (కార్ట్), వంట సామాగ్రి సమకూర్చుతున్నారు. ఈ ఎగ్‌మార్ట్‌లను మెయిన్ రోడ్లు, ముఖ్యమైన కూడళ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్నవారు ఈ ఎగ్‌మార్ట్ కోసం 15 అంశాలకు ఓకే చెబుతూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యార్హత, ఏదైనా వ్యాపార అనుభవం ఉందా, శిక్షణ తీసుకుంటామని ఒప్పుకుంటూ ధ్రువీకరించాలి. ఈ ఎగ్‌మార్ట్‌లను ప్రధానంగా ఉత్పత్తి, తయారీలో అనుభవం ఉన్న డ్వాక్రా గ్రూపుల్లోని ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు
ఈ ఎగ్‌మార్ట్‌ల ద్వారా రోజువారీ గుడ్లను విక్రయించొచ్చు.. అలాగే మార్ట్ నిర్వహణతో పాటుగా పరిశుభ్రంగా ఉంచుకోవడం.. మార్ట్‌ను వినియోగం విషయంలో బాధ్యతగా ఉండేవారిని ఎంపిక చేస్తారు. వీరికి ముందుగా శిక్షణ ఉంటుంది.. వ్యాపారం ఎలా చేయాలి, ఫుడ్ ఎలా తయారు చేయాలి వంటివి నేర్పిస్తారు. ఆ తర్వాత వీరికి ఎగ్‌మార్ట్‌లు, ఇతర సామాగ్రిని కేటాయిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఎగ్‌మార్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని మెప్మా కార్యాలయంలోని కాని అధికారుల్ని కూడా స్పందించాలని సూచిస్తున్నారు. ఎంపికైన వారికి రూ.50 వేల విలువైన కార్ట్, సామాగ్రిని నెక్ అందజేస్తుంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఎగ్‌మార్ట్‌లను ఏర్పాటు చేశారు.
Latest News