|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 01:43 PM
రాజస్థాన్‌లో పెళ్లై 3 నెలలు గడవకముందే భర్త ఆశిష్‌ను భార్య అంజు తన ప్రియుడు సంజూతో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి సమయంలో దంపతులు రోడ్డుపై నడుస్తుండగా సంజూ కారుతో ఆశిష్‌ను ఢీకొట్టి పరారయ్యాడు. మొదట ప్రమాదంగా చిత్రీకరించేందుకు అంజు ఇచ్చిన వాగ్మూలంలో అనేక అనుమానాలు తలెత్తడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అంజుకు ఇంటి సమీపంలో నివసించే సంజూతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు.
గతేడాది ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఇండోర్‌కి చెందిన ఓ యువతి.. భర్తని మేఘాలయకు తీసుకెళ్లి చంపేసింది. తాజాగా రాజస్థాన్‌లో వివాహం జరిగిన 90 రోజులకు ప్రియుడితో కలిసి భర్తని లేపేసింది. పైగా ఆ వ్యవహారాన్ని హిట్ అండ్ రన్ గా మార్చాలని స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసులో లోతుల్లోకి వెళ్తే..రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో హనీమూన్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఆ జిల్లాకు చెందిన ఆశిష్ మూడు నెలల కిందట అంజుని వివాహం చేసుకున్నారు. ఇద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. కానీ అంజు మాత్రం హ్యాపీగా లేదు. చివరకు తన గ్రామానికి తిరిగి వెళ్లిపోయింది. అదే సమయంలో తన మాజీ ప్రియుడు సంజుతో రిలేషన్ షిప్ కంటిన్యూ చేసింది.
Latest News