|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 12:43 PM
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా ఖరారు కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్షలో కులగణన చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు. ఎన్నికల హామీగా ఇచ్చిన ‘బీసీల రక్షణ చట్టం’పై కూడా అధికారులతో సమాలోచన జరిపారు. వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. 6 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా మార్చాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
Latest News