|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 12:22 PM
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సునీత రెడ్డి సవాల్ చేయగా, సీబీఐ దర్యాప్తు పూర్తయిందని, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని, ఇలా అయితే దర్యాప్తుకు నాలుగేళ్లు పడుతుందని జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఎవరిని విచారించాలన్న దానిపై ఆదేశాలు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత విచారణలోనూ సుప్రీంకోర్టు దర్యాప్తుపై అసహనం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా.. సునీత పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను నేటికి (ఫిబ్రవరి 5) వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని ఎవరిని.. విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వమని పేర్కొంది.
Latest News