|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 12:12 PM
తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు బ్యాటింగ్, ఆల్‌రౌండింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బ్యాట్స్‌మెన్ విభాగంలో అభిషేక్ శర్మ నంబర్ 1, తిలక్ వర్మ నంబర్ 4, సూర్యకుమార్ యాదవ్ నంబర్ 6, ఇషాన్ కిషన్ నంబర్ 32 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా నంబర్ 3, శివమ్ దూబే నంబర్ 9 స్థానాల్లో నిలిచారు. బౌలర్ల విభాగంలో వరుణ్ చక్రవర్తి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనలతో భారత జట్టు టీ20ల్లో నంబర్ 1 జట్టుగా అవతరించింది.టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుపు వేగంగా దూసుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో సెంచరీ సాధించిన ఇషాన్.. ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ప్లేస్‌కి చేరుకున్నాడు. ప్రపంచ కప్ గ్రూప్ దశలో భారత తుది జట్టులో చోటు దక్కితే వచ్చే రెండు వారాల్లోనే ఇషాన్ టాప్ 10లోకి చేరే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Latest News