ప్రాథమిక సహాయక చర్యలపై విద్యార్థులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:48 PM

ప్రాథమిక సహాయక చర్యలపై విద్యార్థులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం - రెస్క్యూ మరియు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ శిక్షణ - ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకం - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు. బుధవారం ఎం.ఆర్ నగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ శాఖ, రెడ్ క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “రెస్క్యూ మరియు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్” ప్రదర్శనను జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో అగ్నిమాపక సిబ్బంది వివిధ రకాల అగ్ని ప్రమాదాలను ఎలా అదుపు చేయాలి, భవనాల్లో చిక్కుకున్న వారిని ఎలా సురక్షితంగా బయటకు తీసుకురావాలి (రెస్క్యూ) అనే అంశాలపై ప్రత్యక్షంగా చేసి చూపారు.మంటలు వ్యాపించినప్పుడు గ్యాస్ సిలిండర్లను ఎలా ఆర్పాలి, ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్లను ఎలా వాడాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ప్రాథమిక సహాయక చర్యలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు విద్యార్థులకు సూచించారు.ప్రమాదం జరిగిన మొదటి కొన్ని నిమిషాలు (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని, ఆ సమయంలో ధైర్యంగా వ్యవహరించాలని తెలిపారు.పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని, రెస్క్యూ ఆపరేషన్లలో ఉపయోగించే అత్యాధునిక పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Latest News
US trade deal - a booster shot for India's AI hardware ecosystem Sun, Feb 08, 2026, 05:44 PM
PM Modi departs for India after concluding Malaysia visit Sun, Feb 08, 2026, 05:43 PM
Seychelles President Patrick Herminie arrives in New Delhi Sun, Feb 08, 2026, 05:38 PM
Assam CM targets Gaurav Gogoi over children's British citizenship Sun, Feb 08, 2026, 05:37 PM
T20 WC: Bethell, Brook hit fifty as England post 184/7 against Nepal Sun, Feb 08, 2026, 05:32 PM